జీవిత సత్యం

“జీవిత లక్ష్యం ఏమిటి” అని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే, మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- ‘జీవించడం’ అని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది?

తినడం, తిరగడం, నిద్రపోవడం, చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ‘ఈ జీవితంలో గొప్పతనం ఏముంది’ అని చాలా అరుదుగా, అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది.

జీవించక తప్పదు. జీవిస్తూనే మనిషి తన జీవితం గురించి తెలుసుకోవాలి.

మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏ ఆశయం కోసమో జీవించాలనుకుంటున్నాం. జీవించడమే మన పరమావధిగా ఉంది. దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి. అనేక ఆశయాల సాధనకు పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత సంగీతాన్ని ధ్వంసం చేస్తున్నాయి.

ఓ ఆశయం పెట్టుకుంటే, జీవితంతో మనం ‘యుద్ధం’ చెయ్యాలి. ఘర్షణ పడాలి. అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి. ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి.

జీవితంలో అనేక సంఘటనలు, మార్పులు సంభవిస్తుంటాయి. మనిషి వాటిని గమనిస్తుండాలి. అన్ని ఆందోళనల్నీ విడిచిపెట్టాలి. జీవిత ప్రవాహ గమనాన్ని చక్కగా గమనించాలి. ఆ విధమైన సాక్షిత్వం అతడికి కచ్చితంగా బ్రహ్మానందాన్ని రుచి చూపిస్తుంది.

జీవితం కేవలం జీవించడానికే ఉంది. ఇది ఎవరి కోసమో కాదు. దేని కోసమో కాదు. ఎందుకోసమో కాదు. వాస్తవంలో ఉండే వ్యక్తే నిజంగా జీవిస్తున్నవాడు. అతడే జీవితసత్యం గ్రహించగలడు. జీవిత లక్ష్యాన్ని అందుకునేదీ ఆ మనిషే!

సముద్రంమీదకు వెళ్లేముందే, తీరాన కట్టి ఉన్న నావకు కట్టు విప్పాలని ప్రతి నావికుడికీ తెలుసు. అదేవిధంగా మానవుడూ ‘పరిపూర్ణత్వ కాంతి సాగరం’లోకి తన జీవితపు పడవ ప్రయాణం ప్రారంభించాలి. తీరం వద్ద తన పడవను కట్టాలి. కోరికల గొలుసుల్ని, ఆశయాల ముడుల్ని అతడు విప్పి తీరాలి. ఆ తరవాత తెడ్డు వేయాల్సిన అవసరం అతడికి రాదు.

శ్రీరామకృష్ణ పరమహంస ‘జీవితయానంలో నావ లంగరును ఎత్తి ఉంచు. తెరచాపల్ని లేపి సిద్ధపరచు. దివ్యమైన అనుకూల పవనాలు అనుక్షణం నీ జీవితాన్ని నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నాయి’ అనేవారు.

కేవలం పట్టాలమీదనే నడిచే రైలుబండి కాదు జీవితం. అది ఎత్తుగా ఉండే పర్వతాల నడుమ సాగుతూ, పరవళ్లు తొక్కుతూ, సాగరం వైపు పరుగులు పెట్టే నదిలాంటిది.

ఓషో అన్నట్లు- రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, మరేమీ ఆలోచించకుండా మనిషి కేవలం వాటిని దర్శించాలి. విశాలమైన కడలిమీద అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఏ విధమైన ఆలోచనలూ అతడు చేయకూడదు. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఉంటే చాలు. ఓ మొగ్గ… పువ్వుగా విచ్చుకుంటున్నప్పుడు,ఎటువంటి ఆలోచనలూ చేయక, పూర్తిగా అటువైపు చూస్తూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే ఓ మహా రహస్యం వెల్లడవుతుంది. ప్రకృతి ద్వారం నుంచి ప్రవేశించే అనుమతి మనిషికి లభించి, దివ్య మర్మం అవగతమవుతుంది.

‘ప్రకృతి అనేది దైవాన్ని ఆవరించి ఉన్న ఓ ఆచ్ఛాదన. అంతే తప్ప, అది మరొకటి కానే కాదు. దాన్ని పక్కకు తొలగించే విధానం తెలుసుకున్న వారు జీవితసత్యంతో పరిచయం పెంచుకుంటారు’ అంటారు ఓషో!

Advertisements

మనమంతా విద్యార్థులమే

‘డబ్బును…సామాన్యులు దాచుకుంటారు, నాయకులు సద్వినియోగం చేస్తారు, వ్యాపారవేత్తలు రెట్టింపు చేస్తారు’ ‘మిమ్మల్ని విలువలు నడిపించినంత కాలం… చిన్నపాటి వ్యాపారం చేస్తున్నారా, బహుళజాతి సంస్థను పాలిస్తున్నారా అన్నది అప్రస్తుతం’ ‘ఆరోగ్యాన్ని పణంగాపెట్టి సాధించే గెలుపు గెలుపే కాదు’ ‘జీవితంలో చిట్టచివరి రోజు దాకా…మనమంతా విద్యార్థులమే’

సింహావలోకనం

సింహావలోకనం అనే మాట వినే ఉంటాం. సింహం ఏదైనా లక్ష్యం మీద దాడి చేయడానికి ముందు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటుందట, చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తుందట. ఆ అవలోకనం సింహం కంటే, మనిషికే ముఖ్యం.

ఇదీ కథ

అనగనగా ఓ తాగుబోతు. అతడికి ఇద్దరు పిల్లలు. తండ్రి పెట్టే హింసల్ని భరించలేక ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పెద్దవాడు చెడు సావాసాలతో దొంగగా మారాడు. రెండోవాడు బుద్ధిగా చదువుకుని ఉన్నత విద్యావంతుడు అయ్యాడు. ఒకేరోజు…పెద్దవాడు పోలీసులకు దొరికిపోయాడు, రెండోవాడు యూనివర్సిటీ పట్టా అందుకున్నాడు. ‘నీ విజయానికి కారణం ఏమిటి?’ అని తమ్ముడినీ ‘నీ వైఫల్యానికి కారణం ఏమిటి?’ అని అన్ననూ మీడియా అడిగింది. ‘పేదరికమే నన్ను దొంగను చేసింది’ అన్నాడు అన్న. ‘పేదరికమే నాలో కసిని రగిలించి ఉన్నత విద్యావంతుడిని చేసింది’ అని చెప్పాడు తమ్ముడు. సమస్య ఒకటే. దాన్ని స్వీకరించే పద్ధతిలోనే తేడా ఉంది. అదే నువ్వు ఎంతెత్తుకు ఎదుగుతావో, ఎంత లోతుకు కూరుకుపోతావో నిర్ణయిస్తుంది. ఇదీ కథ.

కుల రాజకీయాలు వద్దు

కులంతో రాజకీయం చేసే నాయకులను ప్రోత్సహించవద్దు సమపాలన చేసే నాయకులను మరవద్దు

KACHARAGADLA

ఒక చిన్న పారిశ్రామిక వేత్త ముంబై లో నివసిస్తూ ఉండేవాడు… అతను తన వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చని పోవాలని నిర్ణయించుకుని… చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు..
ఇంతలో అతను కూర్చున్న బెంచి మీదకే ఒక ముదుసలి వచ్చి కూర్చుని ఏమి నాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావు… అని అడిగాడు… వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు… ఆ ముదుసలి నాయన నీ బాధలు తీరాలంటే ఎంత అవసరమవుతుంది.. అని విచారించి.. 50,00,000 రూపాయలకు చెక్ రాసి ఇచ్చి.. వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు….
మన వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు….
దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని… తిరిగి ఇంటికి వచ్చాడు…..
అతనికి ఆ చెక్ వాడ కుండానే పని ఎలా పూర్తీ చేయాలి అని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు… అవి అన్నీ సంతృప్తిగా అనిపించి .. తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు… అవి

1. తను ముడి సరకు రవాణా చేసినందుకు ఇవ్వవలసిన రుణ దాత లందరినీ సమావేశ పరిచి తన పరిస్థితి వివరించి తన రుణ సదుపాయాన్ని.. 30 రోజుల నుండి 45 రోజులకు మార్చమని ప్రాధేయ పడ్డాడు… అదేమీ చిత్రమో అందరూ దానికి ఆమోద యోగ్యం తెలిపారు…. దీని వలన తనకు 15 రోజుల పాటు వడ్డీ లేని రుణసదుపాయం దొరికి కొంచెం వెసులు బాటు కలిగింది…

 

2. తను వస్తువులు అమ్మి … రావలసిన డబ్బును… తనకు బకాయి పడిన వాళ్ళందరినీ పిలిచి తన పరిస్థితి తెలిపి తనకు 40 రోజుల క్రెడిట్ పీరియడ్ నుండి 30 రోజులకు కుదించమని ప్రాధేయ పడ్డాడు… దీనివలన మరికొంచెం వెసులు బాటు కలిగి… మొత్తం 30 రోజుల పెట్టుబడి వ్యయం చేతికి అందింది

3. ఈ డబ్బుతో రిటైల్ లో కొనే సరుకును హోల్ సేల్ మార్కెట్లో ….. అదే ప్రదేశంలో డబ్బు చెల్లిస్తే పొందే ప్రయోజనలన్నీ పొంది… తక్కువ రేట్ లో సరుకు కొనటానికి వీలవుతుంది… దీనివలన ఉత్పాదన వ్యయం తగ్గి.. లాభాల బాట పడే అవకాశం దొరుకుతుంది…

ఈ విధం గ సంవత్సరం గడిచే సరికి అతని రుణ బాధలన్నీ తీరిపోయి… తిరిగి తన అప్పు చెల్లించే స్థాయికి చేరుకున్నాడు… తను ఇచ్చిన మాట తీర్చుకునేదానికి,,, అదే సమయంలో మన ముదుసలిని కలవటానికి ఆ పార్క్ కే వెళ్లి… అతన్ని ఆత్రంగా కలిసి అతను ఇచ్చిన చెక్ అతనికే ఇచ్చి తన కృతఙ్ఞతలు తెలుపుకున్దామని అనుకుని పార్కుకు వెళ్లాడు.వెతకగా,వెతకగా ఆ ముసలివాడు కనిపించాడు……
ఇంతలో ఒక హాస్పిటల్ నర్స్ అక్కడికి వచ్చి….. ఏమండీ ఈ ముదుసలి ఒక పిచ్చివాడు. … తను రతన్ టాటా అనుకుంటాడు… మీకేమి ఇబ్బంది పెట్టలేదు కదా అని క్షమాపణలు అడిగి అతనిని అక్కడినుండి తీసుకు వెళ్లింది….
మన వ్యాపారి హతాశుడయి మరొక్క మారు ఆ చెక్కును పరిశీలించి చూశాడు… అది ఒక చెల్లని చెక్కు అని అర్ధమైంది….
తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వసమని… అది ఉంటె చేయలేనిదేమి లేదని అర్ధమవుతుంది… ఈ మాత్రం దానికేన తానూ చనిపోదామనుకుంది… “తనను గెలిపించింది డబ్బు కాదు… మొక్కవోని ఆత్మవిశ్వాసమే తనను గెలిపించిందని భావిస్తాడు.”..
“క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు… మొక్కవోని ఆత్మా విశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదని భావిస్తాడు… “
“జీవితంలో క్లిష్ట మయిన సమస్యలు వచ్చినపుడే సంయమనం పాటించాలి…”
” మనం తీసుకునే నిర్ణయాలు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేటపుడు ఇంకా జాగ్రత్తగా… ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి…”
“తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు… క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు…”
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదు… కృషి ఉంటె మనుషులు రుషులవుతారు… మహా పురుషులవుతారు.
.
“మనకు జీవితం 100 సమస్యలను ఇచినా ఒక పరిష్కారం చాలు.. అవన్నీ తొలగిపొవటానికి…”

Source: KACHARAGADLA

చింతపిక్కలు ఏరుకున్న ఆ బీడీ కార్మికుల కూతురే.. ఇప్పుడు వందల మందికి మార్గదర్శి

మంచి చదువు, ఐదంకెల జీతం. చాలామంది యువతీ, యువకులు కోరుకునేది ఇదే. ఎలాంటి టెన్షన్లు లేకుండా జీవితం సాగిపోతే చాలనేది అందరి ఆలోచన. కానీ అశ్వేతా షెట్టి అలా ఆలోచించలేదు. చదువుకునేందుకు తాను పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఎంత శ్రమపడ్డది మర్చిపోలేదు. అలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రాకుండా ఉండేందుకు బోధి ట్రీ ఫౌండేషన్‌ను స్థాపించారు. గ్రామీణ ప్రాంత గ్రాడ్యుయేట్లు, విద్యార్థులకు ఇంగ్లీష్, కమ్యూనికేషన్లలో శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘‘ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ చిన్న గ్రామంలో నేను పెరిగాను. నా బాల్యం ఎంతో ఆనందంగా సాగింది. గ్రామాల్లో పిల్లలందరూ చేసినట్టుగానే బురదలో ఆడుతూ జామపండ్ల కోసం రాళ్లను విసురుతూ చింతపండును తెంపుతూ, శాలువాతో చేపలను పడుతూ ఆనందంగా గడిపాను. పెరిగి పెద్ద అయినప్పటి నుంచి ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. పెద్దల సమక్షంలో పురుషుల గురించి నేను మాట్లాడింది చాలా తక్కువ ’’ అని అశ్వేత షెట్టి ఆవేదన చెందుతారు.
13 ఏళ్ల వయసులో అశ్వేతా షెట్టికి ఎవరికీ రాని అద్భుత అవకాశం వచ్చింది. హెలెన్ కెల్లెర్ ఆటోబయోగ్రఫీలో నటించే అవకాశం దక్కింది. ఆ క్షణాలు ఆమె జీవితంలో మరిచిపోలేనివి. ఆ సందర్భంగా ఆమె జీవితంలో మార్పులను స్పష్టంగా గుర్తించింది. చిన్నప్పటి నుంచి చదువులో అశ్వేత ముందే ఉండేది. అలాగే టీచింగ్ అంటే ఆమె ఎంతో ఇష్టం. పొరుగున ఉండే ఫ్రెండ్స్‌కు చాలాసార్లు ఆమె చదువులో సాయం చేశారు. ఆ తర్వాత 15-20 ఏళ్ల చిన్నారులకు ట్యూషన్ చెప్పేవారు. ఆమె పెరిగి పెద్దదవుతున్నా కొద్దీ ఆమెలోని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ వచ్చింది.
అశ్వేత తల్లిదండ్రులు బీడీ కార్మికులు. నిరక్షరాస్యులు. చదువంటే ఏమిటో తెలియదు. దీంతో పెద్ద తరగతులను చదివేందుకు ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. పరిస్థితులు అడ్డం పడ్డా ఆమె ప్రయత్నాలకు తల్లిదండ్రులెప్పుడూ అడ్డు చెప్పలేదు. ఏదీ కావాలన్న చదివించారు.
కాలేజీ వెళ్లడం ఓ అతిపెద్ద డ్రీమ్…
మొదటి నుంచి ఇంగ్లీష్ పై ఆమెకు అంత పట్టుండేది కాదు. ‘‘తిరునల్వేలి లోని ఓ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. కానీ నేను చదివిన ఏ సబ్జెక్టుపైనా పెద్దగా పట్టు సంపాదించలేకపోయాను. అందుకు కారణం ఆ సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్‌లో ఉండటమే. వాటిని కేవలం గుర్తుంచుకునేందుకు ప్రయత్నించేదాన్ని తప్ప అర్థం చేసుకున్న సందర్భాలు తక్కువే. బట్టీపట్టడం.. హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉన్న కారణంగా మార్కులు భారీగా వచ్చేవి ’’ అని అశ్వేత తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు.
బయట ప్రపంచం గురించి అశ్వేత ఎప్పుడూ కలలు కనేది. ఏదో ఒక రోజు మంచి కాలేజీలో చేరి, మంచి ప్రొఫెసర్ల వద్ద మంచి విద్యను అభ్యసించాలని కోరుకునేది. చిన్నప్పటి నుంచి ఆమె తల్లితో అనేది. ‘ ఏదో ఒకరోజు నేను కాలేజీకి వెళ్తాను’ అని. ఆమె తల్లి కూడా అశ్వేత కోరికను కొట్టిపారేయకుండా ‘మొదట హై స్కూల్ పూర్తి చెయ్యి’ అని సూచించేది. ‘మా అమ్మ ఎప్పుడూ నన్ను నిరుత్సాహపర్చలేదు. కానీ మహిళగా నాది చాలా పెద్ద కోరిక అని నాకు తెలియచెప్పేందుకు ప్రయత్నించింది’’ అని అశ్వేత చెబుతారు.
గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా యంగ్ ఇండియా ఫెల్లోషిప్ గురించి ఓ తమిళ మ్యాగజైన్‌లో చదివింది. ఆమె కోరికలకు తగ్గట్టు పరిస్థితులూ అప్పుడు కలిసొచ్చాయి. ఓ లైబ్రేరియన్ ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు సాయం చేశారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కోసం ఆమె స్నేహితురాలు ఒకరు తన మొబైల్‌ను ఇచ్చేవారు. ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు వెళ్లేందుకు కనీసం ఆమె వద్ద టికెట్‌కు కూడా డబ్బులు లేవు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకుని ఇంటర్వ్యూ బోర్డే .. స్కైప్‌లో ఇంటర్వ్యూ నిర్వహించింది.

భాష కష్టాలు అన్నీ ఇన్నీ కావు

ఆమె తొలిసారిగా ఇంగ్లీష్ మాట్లాడింది టెలిఫోనిక్ ఇంటర్వ్యూలోనే. అప్పుడామె వయసు 20 ఏళ్లు. అశ్వేత ఆ ప్రోగ్రామ్‌కు ఎంపికై ఢిల్లీ వెళ్లింది. కానీ జీవితంలో జరిగే పెనుమార్పులను ఆమె ఊహించలేకపోయింది. జీవితంలో అన్ని కోణాల్లోనూ ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో ఆమె షాక్‌కు గురైంది.

‘‘ఆరంభంలో నేను కాస్త ఉద్వేగానికి గురయ్యాను. నగర జీవితాన్ని చూసి విభ్రాంతి చెందాను. కొంత మంది ప్రొఫెసర్లు తరుచుగా అమెరికన్ యాక్సెంట్‌తో క్లాసులు చెప్తుండటంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. నా ఆలోచనలను ఇంగ్లీష్‌‌లోకి తర్జుమా చేసుకుని.. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇది చాలా కష్టంగా ఉండేది ’’ అని అశ్వేత వివరించారు.

కమ్యూనికేషన్ కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలను మాత్రం వీడలేదు. లెక్చర్స్ అర్థం కాకపోవడంతో మరోసారి చెప్పించుకునేందుకు ప్రొఫెసర్లతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించారు అశ్వేత. అలా సబ్జెక్టుపై పట్టు సంపాదించారు. కేవలం ఇంగ్లిష్ పదాలను ఉచ్చరించడమే కాదు. లోతుగా అవగాహన చేసుకుని గుర్తుంచుకునేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. యంగ్ ఇండియా ఫెలోషిప్ ఆమె కోరికలను నెరవేర్చేందుకు ఎంతో ఉపయోగపడింది.
‘‘ఆ అనుభవం నాకు ఎంతో నేర్పింది. ఇంగ్లీష్‌లో నా రైటింగ్, స్పీకింగ్ నైపుణ్యాలు మెరుగయ్యాయి. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంతో నా తోటి విద్యార్థులు నన్ను గౌరవించడం ప్రారంభించారు. నాతో స్నేహం చేసేందుకు ముందుకొచ్చారు’’ అని అశ్వేత తెలిపారు.

తలుపు తట్టిన అదృష్టం..

ఫెలోషిప్ పూర్తయిన తర్వాత సుఘవాఝవు (ఎస్ వీ) హెల్త్ కేర్ కమ్యునిటీలో ఎంగేజ్మెంట్ మేనేజర్‌గా అశ్వేత పనిచేశారు. గ్రామీణ భారతంలో తక్కువ ఖర్చుకే వైద్యాన్ని ఈ సంస్థ అందించేది. తన ఉద్యోగంలో భాగంగా ఆమె కంటెంట్‌ను డెవలప్ చేయడంతోపాటు అనీమియా, కార్డియో-వాస్క్యూలర్ వ్యాధుల గురించి స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కల్పించేది. మంచి చదువు, గౌరవప్రదమైన ఉద్యోగం. ఎవరికైనా ఇంతకు మించి ఏం కోరుకుంటారు. కానీ అశ్వేత మాత్రం ఏదో వెలితిగా ఫీలయ్యారు.
‘‘ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు నా మదిని తొలిచేసేవి. నేను అంత కష్టపడి చదివింది ఇందుకేనా? అనిపించేది. ఇందులో ప్రపంచాన్ని మార్చేందుకు ఏముంది ? గ్రామాల్లో పెద్దగా చదువుకోకుండా ఉండిపోయిన నా స్నేహితులకూ.. నాకూ ఉన్న తేడా ఏంటి ? అని అనిపించేది ’’ అని అశ్వేత వివరించారు.
రెండు అంశాల కారణంగా తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె భావిస్తారు. ఒకటి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, రెండు సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడం.

బోధి ట్రీ ఫౌండేషన్ ఆవిర్భావం

ఆలోచనల పరంపర కారణంగా అశ్వేత ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయింది. తిరునల్వేలి వెళ్లిపోయి బోధి ట్రీ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చారు.
‘‘ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నవారు సైతం ఇతరులతో చక్కగా మాట్లాడగలరని మేం గాఢంగా విశ్వసించాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని తమపై పెట్టిన బాధ్యతలను కార్యరూపంలోకి తీసుకురావడం నేర్చుకోవాలి. అలాగే తమ గ్రామాలను బాగు చేసుకోవలనుకునే వారికి కూడా మా శిక్షణ ఉపయోగపడుతుందని మేం భావించాం’’ అని ఆమె వివరిస్తారు.
గ్రామీణ ప్రాంత గ్రాడ్యుయేట్స్‌కు ఉన్న ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఆంట్రప్రెన్యూర్షిప్ వంటి అవకాశాల గురించి మూడు గంటల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు అశ్వేత. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం పాజిటివ్ యాటిట్యూడ్ కోర్సులను తీసుకుంటూ ఉంటారు.
తమ టీంలోని ముగ్గురు సభ్యులైన బాలాజీ, సెబాస్టియన్, పద్మల కారణంగానే తమ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అశ్వేత చెప్తుంటారు. తొలి ఏడాదిలోనే ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల వెనుక వీరి కృషి ఎంతో ఉంది. 2500 మందికి అవగాహనా కార్యక్రమాలు, 600 మందికిపైగా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్ అంశాలపై శిక్షణ, 20కి పైగా కాలేజీల్లో శిక్షణ వంటి కార్యక్రమాలను వీరు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం తమ కార్యాలయంలోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలే నిర్వహిస్తున్న లీప్ ఫార్వర్డ్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నదీ సంస్థ. మొత్తానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై ఉన్నభయాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అశ్వేత.
అశ్వేత మంచి మాటకారి కూడా. ఆమె తన అనుభవాన్ని ఇలా వివరించారు. ‘‘ నా మాటకారి తనమే నన్ను ఈ ప్రపంచంలో నిలబెట్టగలిగింది. ప్రపంచానికి నా గొంతును వినిపించేలా చేసింది. ఇతరులు నాకు కేవలం అండగా నిలబడ్డారు. నేను చెప్పిన మాటలను, నా సమస్యలను వారు అర్థం చేసుకున్నారు ’’.
తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్లస్ ట్రస్ట్ అశ్వేతకు ఎంతో సపోర్టుగా నిలిచింది. బోధి ట్రీ ఫౌండేషన్ పెట్టిన కొత్తలో ఆర్థికంగా ఆదుకుంది. మదర్ థెరిసా వైఐఎఫ్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ స్కాలర్షిప్ కూడా సంస్థను కొనసాగించేందుకు సాయపడింది. కొంతమంది ఉదారవాదుల నుంచి కూడా ఆమె నిధులు సమీకరించారు. తన గమ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు మరిన్ని నిధులను సమీకరించాలని అశ్వేత భావిస్తున్నారు.
అశ్వేతకు ఒక కల ఉంది. జ్ఞానం, నైపుణ్యం, వనరులు, అవకాశాల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడాలేకుండా చూపాలన్నదే ఆమె లక్ష్యం. ఈ కలను సాకారం చేసేందుకు బోధి ట్రీ ముందుకు సాగుతోంది.
‘‘ గ్రామీణ ప్రాంతాల్లో నాతోటి సహచరులకు దక్కని అవకాశం నాకు దక్కడం ఎంత అదృష్టమో నేను రోజు గుర్తుచేసుకుంటూ ఉంటాను. కొద్దిపాటి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ నా ఆశయాలను విస్తరించుకునేందుకు, స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటాను’’ అని అశ్వేత ముగించారు.
ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టి.. మరింత మంది గ్రామీణ విద్యార్థులను మెరికల్లా తయారు చేయాలని మనమూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అశ్వేతా.
మరిన్ని స్పూర్తి వంతమైన విజయగాధల  కోసం: http://telugu.yourstory.com/

Source: KACHARAGADLA