వేములవాడ భీమకవి (మైలమ భీమ )

రణతిక్కన సొదరుడు మైలమభీముడు. ఇతను కూడా మహాశూరుడు, భీమకవి అనుగ్రహమును కలిగినవాడు.ఈ మైలమభీమునికి యుద్ధము నందు విజయమే తప్ప పరాజయమెన్నడూ కలుగకుండే విధంగా వేములవాడ భీమకవి వరమిచ్చారు. ఆ వరము వలన ఎప్పుడూ ఈ మైలమభీమునికి పరాజయమను మాటే లేకుండెను. యుద్ధములో శత్రువులను ఓడించగల సామర్థ్యము అబ్బింది. భీమకవి ఇతని శౌర్యపరాక్రమమును గురించి ఎన్నో అద్భుతపద్యాలతో వివరించారు. వాటిలో కొన్ని మాత్రమే  దొరికాయి.

చ      గరళపు ముద్ద లోహ మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్

హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోఱలు పట్టకార్లు ది

క్కరటి శిరంబు దాయి లయకారుడు కమ్మరి – వైరివీర సం

హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్

భావము: లయకారకుడైన శివుడే స్వయాన కమ్మరియై, తన కంఠాన దాచుకున్న కాలకూటవిషమునే (గరళపుముద్ద) ఇనుపలోహముగా మార్చి, దద్దిల్లుతూ కోట్లకొలదిగా రాలే పిడుగులను సమ్మెటలుగా(దభీదభీమని మోదే సుత్తులు) వాడి, తన కనుమంటలనే కొలిమిగా చేసి, తన మెడలో ధరించిన సర్పరాజు వాసుకి యొక్క కోరలనే పట్టుకార్లుగా చేసి, ఎనిమిది దిక్కులా భూమిని మోస్తూ ఉన్న అష్టదిగ్గజాలలో (ఎనిమిది ఏనుగులు) ఒక ఏనుగును తలదాయిగామార్చి, శత్రుసంహారములో, గుణాలలో రాముడంతటివాడైన మైలమ భీముని ఖడ్గమును సృష్టించాడు.

అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! భీమకవి వర్ణించిన  మైలమభీముని ఖడ్గం ఎంత శక్తివంతమైనదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమైనదో ధ్వనించే పద్యమిది. తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణవాక్కు వేములవాడ భీమకవిది.

ఈ మైలమభీమన చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు “పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి” అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు.

 

ఈ మైలమభీముని కీర్తి గురించి పొగుడుతూ భీమకవి చెప్పిన ఇంకో పద్యం ఇది.

ఉ       నేరుపు బ్రహ్మఁ జేరె నిజనిర్మల తేజము సూర్యుఁ జేరెఁ నా

కారము కాముఁ జేరెఁ నధికంబగు లక్ష్మియనంతుఁ జేరె గం

భీరత వార్థిఁ జేరెఁ గల పెంపు కులాద్రుల జేరెఁ గీర్తి దా

నూరట లేక త్రిమ్మరుచు నున్నది మైలమ భీముఁడీల్గినన్

భావము: మైలమ భీముని మరణము తర్వాత అతని నైపుణ్యం బ్రహ్మను చేరింది. అతని తేజస్సు సూర్యుణ్ణి చేరింది. రూపము మన్మధుణ్ణి చేరింది. అతని సంపద (లక్ష్మి) విష్ణువును చేరింది. గాంభీర్యము సముద్రాన్ని చేరింది. ఔన్నత్యము కులపర్వతాలను చేరింది. కానీ మరణము వలన అతని కీర్తి మాత్రం ఎక్కడ చేరాలో తోచక ఈ లోకంలోనే తిరుగుతున్నదట. అనగా నేర్పు మొదలగు గుణాలలో అతనికి సమానులుగా చెప్పదగిన బ్రహ్మాదులున్నారు. కానీ అతని మరణం తర్వాత కీర్తికి ఆశ్రయం లభించలేదంటే అతనితో సమానకీర్తి గల మరొక ఆశ్రయమేదీ ప్రపంచములో లేదని అతడు అసమాన కీర్తిశాలి అని భావము.

మైలమభీముని పరాక్రమమును గురించి కొనియాడుతూ భీమకవి ఎన్నో అద్భుతపద్యాలను రచించాడు.

పూర్తి చరిత్ర కొరకు: http://shrivemulawadabheemakavi.blogspot.in/p/blog-page_3993.html

 

Advertisements

జీవిత సత్యం

“జీవిత లక్ష్యం ఏమిటి” అని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే, మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- ‘జీవించడం’ అని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది?

తినడం, తిరగడం, నిద్రపోవడం, చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ‘ఈ జీవితంలో గొప్పతనం ఏముంది’ అని చాలా అరుదుగా, అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది.

జీవించక తప్పదు. జీవిస్తూనే మనిషి తన జీవితం గురించి తెలుసుకోవాలి.

మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏ ఆశయం కోసమో జీవించాలనుకుంటున్నాం. జీవించడమే మన పరమావధిగా ఉంది. దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి. అనేక ఆశయాల సాధనకు పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత సంగీతాన్ని ధ్వంసం చేస్తున్నాయి.

ఓ ఆశయం పెట్టుకుంటే, జీవితంతో మనం ‘యుద్ధం’ చెయ్యాలి. ఘర్షణ పడాలి. అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి. ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి.

జీవితంలో అనేక సంఘటనలు, మార్పులు సంభవిస్తుంటాయి. మనిషి వాటిని గమనిస్తుండాలి. అన్ని ఆందోళనల్నీ విడిచిపెట్టాలి. జీవిత ప్రవాహ గమనాన్ని చక్కగా గమనించాలి. ఆ విధమైన సాక్షిత్వం అతడికి కచ్చితంగా బ్రహ్మానందాన్ని రుచి చూపిస్తుంది.

జీవితం కేవలం జీవించడానికే ఉంది. ఇది ఎవరి కోసమో కాదు. దేని కోసమో కాదు. ఎందుకోసమో కాదు. వాస్తవంలో ఉండే వ్యక్తే నిజంగా జీవిస్తున్నవాడు. అతడే జీవితసత్యం గ్రహించగలడు. జీవిత లక్ష్యాన్ని అందుకునేదీ ఆ మనిషే!

సముద్రంమీదకు వెళ్లేముందే, తీరాన కట్టి ఉన్న నావకు కట్టు విప్పాలని ప్రతి నావికుడికీ తెలుసు. అదేవిధంగా మానవుడూ ‘పరిపూర్ణత్వ కాంతి సాగరం’లోకి తన జీవితపు పడవ ప్రయాణం ప్రారంభించాలి. తీరం వద్ద తన పడవను కట్టాలి. కోరికల గొలుసుల్ని, ఆశయాల ముడుల్ని అతడు విప్పి తీరాలి. ఆ తరవాత తెడ్డు వేయాల్సిన అవసరం అతడికి రాదు.

శ్రీరామకృష్ణ పరమహంస ‘జీవితయానంలో నావ లంగరును ఎత్తి ఉంచు. తెరచాపల్ని లేపి సిద్ధపరచు. దివ్యమైన అనుకూల పవనాలు అనుక్షణం నీ జీవితాన్ని నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నాయి’ అనేవారు.

కేవలం పట్టాలమీదనే నడిచే రైలుబండి కాదు జీవితం. అది ఎత్తుగా ఉండే పర్వతాల నడుమ సాగుతూ, పరవళ్లు తొక్కుతూ, సాగరం వైపు పరుగులు పెట్టే నదిలాంటిది.

ఓషో అన్నట్లు- రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, మరేమీ ఆలోచించకుండా మనిషి కేవలం వాటిని దర్శించాలి. విశాలమైన కడలిమీద అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఏ విధమైన ఆలోచనలూ అతడు చేయకూడదు. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఉంటే చాలు. ఓ మొగ్గ… పువ్వుగా విచ్చుకుంటున్నప్పుడు,ఎటువంటి ఆలోచనలూ చేయక, పూర్తిగా అటువైపు చూస్తూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే ఓ మహా రహస్యం వెల్లడవుతుంది. ప్రకృతి ద్వారం నుంచి ప్రవేశించే అనుమతి మనిషికి లభించి, దివ్య మర్మం అవగతమవుతుంది.

‘ప్రకృతి అనేది దైవాన్ని ఆవరించి ఉన్న ఓ ఆచ్ఛాదన. అంతే తప్ప, అది మరొకటి కానే కాదు. దాన్ని పక్కకు తొలగించే విధానం తెలుసుకున్న వారు జీవితసత్యంతో పరిచయం పెంచుకుంటారు’ అంటారు ఓషో!

మనమంతా విద్యార్థులమే

‘డబ్బును…సామాన్యులు దాచుకుంటారు, నాయకులు సద్వినియోగం చేస్తారు, వ్యాపారవేత్తలు రెట్టింపు చేస్తారు’ ‘మిమ్మల్ని విలువలు నడిపించినంత కాలం… చిన్నపాటి వ్యాపారం చేస్తున్నారా, బహుళజాతి సంస్థను పాలిస్తున్నారా అన్నది అప్రస్తుతం’ ‘ఆరోగ్యాన్ని పణంగాపెట్టి సాధించే గెలుపు గెలుపే కాదు’ ‘జీవితంలో చిట్టచివరి రోజు దాకా…మనమంతా విద్యార్థులమే’

సింహావలోకనం

సింహావలోకనం అనే మాట వినే ఉంటాం. సింహం ఏదైనా లక్ష్యం మీద దాడి చేయడానికి ముందు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటుందట, చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తుందట. ఆ అవలోకనం సింహం కంటే, మనిషికే ముఖ్యం.

ఇదీ కథ

అనగనగా ఓ తాగుబోతు. అతడికి ఇద్దరు పిల్లలు. తండ్రి పెట్టే హింసల్ని భరించలేక ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పెద్దవాడు చెడు సావాసాలతో దొంగగా మారాడు. రెండోవాడు బుద్ధిగా చదువుకుని ఉన్నత విద్యావంతుడు అయ్యాడు. ఒకేరోజు…పెద్దవాడు పోలీసులకు దొరికిపోయాడు, రెండోవాడు యూనివర్సిటీ పట్టా అందుకున్నాడు. ‘నీ విజయానికి కారణం ఏమిటి?’ అని తమ్ముడినీ ‘నీ వైఫల్యానికి కారణం ఏమిటి?’ అని అన్ననూ మీడియా అడిగింది. ‘పేదరికమే నన్ను దొంగను చేసింది’ అన్నాడు అన్న. ‘పేదరికమే నాలో కసిని రగిలించి ఉన్నత విద్యావంతుడిని చేసింది’ అని చెప్పాడు తమ్ముడు. సమస్య ఒకటే. దాన్ని స్వీకరించే పద్ధతిలోనే తేడా ఉంది. అదే నువ్వు ఎంతెత్తుకు ఎదుగుతావో, ఎంత లోతుకు కూరుకుపోతావో నిర్ణయిస్తుంది. ఇదీ కథ.

సంకల్పం

దేవుడు తనకు తానుగా ఏది ఇవ్వడు, మనం మనకు కావలసింది దేవుడి నుంచి తిసుకోవాలి. అది సంకల్పం ద్వారానే సాధ్యమౌతుంది.

ఉదాహరణకు మంచి విధ్యాబుద్దులను ప్రసాదించు స్వామి అని దేవుడిని కోరుకున్నావు అనుకో, అది సంకల్పం మాత్రమే….అలా కోరుకుని (సంకల్పించుకుని) ఎలాంటి సాధన చేయకుండా ఉంటె మంచి విధ్యాబుద్దులు ఎలా వస్తాయి.

మన దేవుడి దగ్గరకెళ్ళి ఒక కోరిక అడుగుతున్నాము అంటె ” మనం ఏ కోరికైతె కోరామొ అ కోరికకు సంబదించినటువంటి కార్యక్రమాన్ని దేవుడి సమక్షంలో సంకల్పించుకుంటున్నాము అని అర్థం ” కావున దేవుడుని మనం అడుగుతున్నాము అంటె సంకల్పం చెసుకుంటున్నాము అని అర్థం.

” సంకల్పానికి సాధన తోడైతెనె విజయం సిద్దిస్తుంది. “

తోడు

వేణువుకు గాలి తోడైతెనె…రాగం ప్రాణం పోసుకుంటుంది.

మనిషికి మనిషి తోడైతెనె మానవ జీవనం కొనసాగుతుంది

పుడమి తల్లికి వర్షపుధారలు తోడైతెనె ఈ సృష్టిలో జీవజాలం మనుగడ సాగించగలదు

జ్ఞానానికి చిత్తశుద్ది తోడైతెనె అర్థవంతమైన ఫలితాలు వస్తాయి